17-07-2025 01:42:51 AM
శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేత
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 16 (విజయక్రాంతి): శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో బుధవారం వార్డు 5 వాసవీనగర్, కాకాగూడలోని పామెన్ కాప్ మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకు స్పీచ్ థెరపీకి సంబంధించిన మెటీరియల్‌ను అందజేశారు. పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం శ్రీ గణేష్ ఫౌండేషన్ నిర్వాహకుడు ముకుల్ మాట్లాడుతూ..
శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. ఇలాంటి పిల్లలను చూసి నప్పుడు వారికి తాము ఏమైనా సహాయం చేయగలనేమో అని ఆలోచించి ఫౌండేషన్ ద్వారా వారికి స్పీచ్ థెరపీకి సంబంధించిన మెటీరియల్‌ను అందజేశామన్నారు. భవిష్యత్తులో వారికి ఎటువంటి అవసరం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.