calender_icon.png 17 July, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

17-07-2025 01:39:38 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్‌కు ఐఎన్టీయూసీ వినతి

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 16 (విజయక్రాంతి): జీహెఎంసీలో ఏళ్లుగా పేరుకుపోయిన ఉద్యోగ, కార్మిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఐఎన్టీయూసీ అనుబంధ, గుర్తింపు పొందిన మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ నేతృత్వంలోని బృందం, జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా ఆదిల్ షరీఫ్ మాట్లాడుతూ.. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ పోస్టుల్లో ఏళ్లుగా పనిచేస్తున్న అరులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం లేదన్నారు. దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇప్పటికైనా పదోన్నతుల కల్పించి న్యాయం చేయాలని కోరారు.

గత ప్రభుత్వం ఔట్‌సోర్స్, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి కాలయాపన చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వ మైనా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డుల పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని కోరారు.

సానుకూలంగా స్పందిం చిన కమిషనర్ కర్ణన్.. తన పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని, రాష్ర్ట ప్రభుత్వ పరిధిలోని అంశాలను వారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కమిషనర్‌ను కలిసిన వారిలో యూనియన్ జనరల్ సెక్రటరీలు ఆర్‌డి చంద్రశేఖర్, ఏవీఎస్ గాంధీ, ఉపాధ్యక్షుడు రాజ్‌రెడ్డి ఉన్నారు.