21 August, 2026 | 1:27 AM

ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి

21-08-2026 12:15 AM
  1. పాత పద్ధతిలోనే ఫీజుల పథకాన్ని కొనసాగించాలి
  2. పాలిటెక్నిక్ కాలేజీలను ఎత్తివేసే కుట్రలను తక్షణమే విరమించుకోవాలి
  3. లేనిపక్షంలో యుద్ధమే..
  4. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, ఆగస్టు 20(విజయక్రాం తి):  ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 8 వేల కోట్లు వెంటనే చెల్లించి, పాత పద్ధతిలోనే ఫీజుల పథకాన్ని కొనసాగించాలని జా తీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రా జ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన రూ.2,300 కోట్లు ఎక్కడ డిపాజిట్ చే శారో, విద్యార్థులకు ఎందుకు అందించడం లేదో స్పష్టం చేయాలని కోరారు. లేని పక్షం లో రాష్ట్రంలో యుద్ధమే కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. 

ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ  రాష్ట్రంలోని సు మారు 4 లక్షల మంది కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లోనే ఉన్నాయని, ఫీజులు చెల్లించే వరకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నా రని తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లు చెల్లించాలని కోరారు. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్‌ఓ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించి వినతిపత్రాలు సమర్పించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు విద్యార్థుల ఫీజులను పూర్తిగా చెల్లించాలని, స్కాలర్షిప్లను రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్  కాలేజీలను ఎత్తేసే కుట్రను మానుకోవాలన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు  ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో  జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్య, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల రాందేవ్ మోడీ, సి. రాజేందర్, నిఖిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.