‘ఫీజు’ బకాయిలు విడుదల చేయాలి
- బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్
- విద్యార్థులతో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి
ముషీరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థులకు సంబంధించిన రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే వి డుదల చేయాలని శుక్రవారం హైదరాబాద్ కలెక్టరేట్‌ను వేలాది మంది విద్యార్థులు ము ట్టడించారు. జీవో నెం.9ను రద్దు చేసి పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్ నాయకత్వంలో ఈ నిరసన జరిగింది.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్మ్‌మెంట్ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు మానుకోవాలని, జీవో 9ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రూ.8 వేల కోట్ల బకాయి లు చెల్లించాలని, లేకుంటే ఉద్యమాలను ఉ ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్య క్షుడు అనంతయ్య, రాజేందర్, బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ నిఖిల్ పాల్గొన్నారు.






