14-09-2025 12:00:00 AM
తాము ఇస్తున్న వాగ్దానాలన్నింటినీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిం ది. రేవంత్ సీఎంగా అధికారం చేపట్టి ఏడాదిన్నర గడచినా నేటికీ ఆయా హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారు. ముఖ్యం గా విద్యారంగం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందగా తయారైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
కుటుంబ వార్షికాదా యం రూ. 3 లక్షల లోపు ఉన్న విద్యార్థులకు వారి కోర్సులకనుగుణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఆ హామీలను రేవంత్ ప్రభుత్వం విస్మరించడంతో విద్యార్థులకు వారి కళాశాలల నుంచి ఫీజుల వేధింపులు తప్పడం లేదు. అంతేకాదు విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే స్కాలర్‌షిప్‌లు కూడా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా లేవు.
తాము ఇప్పటికీ బీసీల పక్షానే ఉన్నామని కాంగ్రెస్ నమ్మబలుకుతోంది. కానీ వారు ఆచరిస్తున్న విధానం మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం చిత్తశుద్ధితో హామీల అమలుకు కృషి చేయాలి. అయితే వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో తాము కాలేజీలు నడపలేమని ప్రైవేటు ఇంజినీరింగ్ సహా వృత్తి విద్య కాలేజీ యాజమాన్యాలు తేల్చి చెప్పడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారనుంది.
ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 15 నుంచి కాలేజీలు మూసేస్తామని ప్రైవేటు కాలేజీలు హెచ్చరించాయి. దీనిపై తక్షణమే ప్రభు త్వం స్పందించి మెడికల్, ఇంజినీరింగ్, ఇతర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి. ఆయా విద్యార్థుల నుంచి కళాశాలలు వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లించేలా చర్యలు చేపట్టాలి.
నాగరాజు, జాగిత్యాల