14-09-2025 12:00:00 AM
కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు.. ఇటీవలి కాలంలో పూజా సామగ్రి వ్యాపారంలోనూ కల్తీ యమ జోరుగా సాగుతోంది. నాసిరకం పూజా ద్రవ్యాలతో దైవానికి అపచారం జరుగుతుంది. దీని ల్ల మనం మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, ఆరోగ్యం కోల్పోతు న్నాం. వ్రతం అనంతరం స్త్రీలు వాయనాలు ఇచ్చే క్రమంలో కుంకుమ, పసుపు, వక్కపొడి పొట్లాలు తప్పక ఇవ్వాల్లి ఉంటుంది. అయితే మార్కెట్లో ఈ ద్రవ్యాల్లో కల్తీ పెరిగిపోయింది. నాసిరకం కుంకుమ, పసుపు తయారీతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
ఇక సంప్రదాయబద్ధంగా మనం వాడే పూజా నూనెల్లో రైస్‌బ్రాన్ ఆయిల్ కలిపి అమ్ముతున్నారు. దీపారాధనకు వాడేవి సంప్రదాయంగా ఉండాలి ఎలాంటి కల్తీ జరగకూడదని నా అభిప్రాయం. ఇక అగరువత్తులకు సంబంధించి గోమయంతో చేసినవి కాకుండా సువాసనలకోసం రసాయనాలు కలిపినవి వాడుతున్నారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని నాసిరకం పూజ సామగ్రిని తయారీ చేయకుండా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నాం.
వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్