ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి
తీజ్‌ను జాతీయ పండువగా గుర్తించాలి: గణేష్ నాయక్
ముషీరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నంగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు ధరావత్ గణేష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు సెలవు దినంగా ప్రకటించాలని, ఏటా జయంతి వేడుకలకు రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు. తీజ్ పండుగను జాతీయ పండుగగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాస్మోటిక్ చార్జీలు పెంచి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.
గిరిజన సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయాలని గణేష్ నాయక్ కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం, లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చలో అసెంబ్లీముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు ఇందల్ రాథోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ బంజారా, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నాయక్, బాలాజీ నాయక్, రమేష్ నాయక్, గణేష్ నాయక్, రాజ్కుమార్, రోహిత్ నాయక్, శ్రీనివాస్ నాయక్, అశోక్ నాయక్, భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






