calender_icon.png 29 August, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

54 అడుగుల భారీ వినాయకుడు

29-08-2025 04:12:55 AM

ఖైరతాబాద్ తర్వాత ఆదిలాబాద్‌లోనే ఎత్తున గణనాథుడు

ఆదిలాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఎత్తున వినాయకుని విగ్రహం అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణనాథుడే. అదేమదిరిగా ఆదిలాబాద్‌లో సైతం గత కొన్నేళ్లుగా ఎత్తున గణనాధుని ప్రతిష్టించి గణేష్ ఉత్సవాలకు వన్నెతెస్తున్నారు ఆదిలాబాద్ వాసులు.  ఖైరతాబాద్ గణనాథుని తర్వాత ఎత్తున విగ్ర హం ఆదిలాబాద్‌లో ప్రతిష్టించారు.

కుమార్ జనతా గణేష్ మండల్ ఆద్వర్యంలో మండ పం నిర్వాహకులు భారీ ఎత్తున గణనాథున్ని ప్రతిష్ఠియించారు. నూతి మీది గణపతిగా ప్రసిద్ధిగాంచిన కుమార్ జనతా గణేష్ మం డల్ ఆధ్వర్యంలో 54 అడుగుల ఎత్తున విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ భారీ విగ్రహం ఆదిలాబాద్ చెందిన ప్రముఖ విగ్రహా శిల్పి ఊరే గణేష్ చేతుల్లో రూపుదిద్దుకుంది. ఎత్తు న గణనాధుని చూసేందుకు ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

కొలువుదీరిన గణనాథులు 

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 28(విజయ క్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవా లను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా బుధవారం గణనాథులు కొలువుదీరారు. నిర్వాహకులు మండపాలను ఎంతో చక్కగా అలంకరించి వినాయకుడిని ప్రతిష్టించారు. తొమ్మిది రోజులపాటు పూజలు అందుకోనున్న ఏకదంతునికి భక్తులు ఆరాధించ నున్నారు. గురువారం రెబ్బెన మండల కేం ద్రంలో ఏర్పాటు చేసిన వినాయకుడికీ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పూజలు నిర్వహించా రు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తన నివాసంలో వినాయకుడిని ప్రతిష్టించి కుటుంబ సభ్యుల తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.