29-08-2025 11:52:41 AM
మాడ్గుల: తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడు ఇంటిముందు ధర్నాకు దిగిన ఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా(Rangareddy district) మాడ్గుల మండలంలో సుద్దపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఐనవోని శివ, నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని తిరుమలపురం గ్రామానికి చెందిన స్వాతి అనే యువతితో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రియుడు శివ పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు స్వాతిని నమ్మించడంతో ఇరువురు శారీరకంగా సైతం దగ్గరయ్యారు.
అయితే ప్రియురాలు స్వాతి ఇటీవలనే పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ప్రియుడు శివ ముఖం చాటేసారు. పలు సార్లు కలిసిన కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ప్రియురాలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. ఇట్టి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు కుటుంబ సభ్యులకు సమస్య ను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసు ఇరు వర్గాలకు నచ్చ చెప్పినట్లు సమాచారం. లేని యెడల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.