29-08-2025 11:54:35 AM
తుంగతుర్తి( విజయ క్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుమారు కోటి రూపాయల వ్యయంతో మండల కేంద్రంలో భవనాన్ని నిర్మించారు. ప్రజా ప్రతినిధులు మాత్రం నేనంటే నేను అనుకుంటూ భవనాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన భవనం రెండు సంవత్సరాల గడుస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో భవనములో కావలసిన నీటి సౌకర్యం, విద్యుత్, చుట్టూ ప్రహరీ, నిధుల కొరతతో పూర్తికాలేదు.
నిర్మించినటువంటి అంబేద్కర్ భవనం వినియోగంలోకి తీసుకురావాలని అదనపు కలెక్టర్ రాంబాబు కు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లె పాక సాయి బాబా, బీజేవైఎం జిల్లా నాయకులు బొంకూర్ నవీన్ వినతి పత్రం అందించడం జరిగింది. ఏది ఏమైనా నియోజకవర్గ దళిత ప్రజల ప్రత్యేక అవసరాల కోసం, ఇతర భవనాలకు వెళ్లి కార్యక్రమాలు చేస్తే, వేల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు ప్రత్యేక చొరవ తో, తక్షణమే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి, ప్రత్యేక నిధులు కేటాయించి, మరమ్మత్తులను పూర్తి చేసి, అందుబాటులోకి తేవాలని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.