22 July, 2026 | 2:01 AM

బిచ్కుంద మున్సిపల్ చైర్ పర్సన్‌కు సన్మానం

22-07-2026 12:50 AM

అన్ని పార్టీల కౌన్సిలర్లు గెట్ టు గెదర్‌కు  హాజరు 

బిచ్కుంద, జూలై 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ చైర్పర్సన్ సీమా షెట్కార్ మంగళవారం తన నివాస గగృహంల పార్టీలకతీతంగా కౌన్సిలర్ల తో గెట్ టు గెదర్ నిర్వహించారు. ప్రతి కౌన్సిలర్ సన్మానించారు. అందరం కలిసికట్టుగా బిచ్కుంద పట్టణ అభివృద్ధికి కృషి చేద్దామని ఈ సందర్భంగా చైర్పర్సన్ సీమా షెట్కార్ తెలిపారు. మొదటిసారి మున్సిపల్ గా మారిన తర్వాత పాలకవర్గం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.

పార్టీలను మరిచి అభివృద్ధి వైపు అడుగులు వేద్దామని కోరారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు అందరూ సమ్మతి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు, ఎంపీ సురేష్ షట్కార్ లను కలిసి ప్రత్యేక అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు కోసం కృషి చేద్దామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, కౌన్సిలర్లు గోనె హనుమవ్వ, చిన్న మారుతి, కార్తిక దర్పల్, బొమ్మల ఆనిత, ముజాహిద్, జాదవ్ నౌషా నాయక్, గులాం సంధాని, శ్యామల, పాల్గొన్నారు.