22 July, 2026 | 1:30 AM

జంతర్ మంతర్‌లో విద్యార్థులపై లాఠీఛార్జి అమానుషం

22-07-2026 12:50 AM

మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవేందర్ గౌడ్

మేడ్చల్ అర్బన్, జూలై 21 (విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ  ప్రభుత్వం త మ వైఫల్యాలపై పో రాడుతున్న పలువర్గాల ప్రజలను అణిచివేయాలని చూస్తుందని మేడ్చల్ మున్సిపల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ విమర్శించారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యాలను ఎండగడుతూ పదవికి రాజీనామా చేయాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద ప్రజాస్వామ్యతంగా నిరసనకు దిగిన విద్యార్థులపై అమానుషంగా లాఠీ ఛార్జీ చేయడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని రాఘవేందర్ గౌడ్ తెలిపారు.  లాఠీ ఛార్జీకి కారణమైన అధికారులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రామన్నగారి రాఘవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు...