12 May, 2026 | 3:40 AM

తెలుగు అకాడమీ చైర్మన్‌కు సన్మానం

12-05-2026 01:33 AM

వరంగల్, మే 11 (విజయక్రాంతి): వరంగల్ నగరానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమీ చైర్మన్ గా నియమించింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ వెంకటనారాయణ ను  గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు సోమవారం ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కూరపాటి పాత్ర అనిర్వచనీయమైనదని కొనియాడా రు. ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మంత్రులు పొంగు లేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ఎంఎల్‌ఏలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులకు వేముల నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.