12 May, 2026 | 3:40 AM

ఎకో సెన్సిటివ్ జోన్ అన్నది గిరిజనులకు మాత్రమేనా?

12-05-2026 01:34 AM

గిరిజనేతరులకు వర్తించదా ?

మంగపేట, మే 11 (విజయక్రాంతి) : ఎకో- సెన్సిటివ్ జోన్ అన్నది గిరిజనులకు మాత్రమేనా ?, గిరిజనేతరులకు వర్తించదా అని మండల కేంద్రంలోని గంపోనిగూడెంకు చెందిన శ్రీ మహాలక్ష్మి ముత్యాలమ్మ ఇసుక క్వారీ సొసైటీ అధ్యక్షులు ఈసాల భాగ్యరాజు ప్రశ్నించారు. సోమవారం మండలంలోని గంపోనిగూడెంలో శ్రీ మహాలక్ష్మి ముత్యాలమ్మ ట్రైబల్ ఇసుక, మొరం క్వారీ లేబర్ కాంట్రాక్ట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు సమావేశం పూనెం ప్రశాంత్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈసాల భాగ్యరాజు మాట్లాడుతూ శ్రీ మహాలక్ష్మి ముత్యాలమ్మ ఇసుక క్వారీ సొసైటీ గతంలో 2022 సంవత్సరంలో గంపోనిగుడెం గ్రామ సమీపంలో గోదావరిలో ఎలాంటి నిబంధనలు లేకుండా ఇసుక క్వారీ నిర్వహించిందని అన్నారు. అలాంటిది ఇప్పుడు ఇసుక క్వారీ నిర్వహించాలంటే ఎకో- సెన్సిటివ్ జోన్ అని అధికారులు అనుమతి ఇవ్వడం లేదని అన్నారు. ఎప్పుడు లేని ఎకో- సెన్సిటివ్ జోన్ ఇప్పుడు ఎలా వచ్చిందన్నది మండల, జిల్లా అధికార యంత్రాంగం చెప్పాలని డిమాండ్ చేశారు.

శ్రీ మహాలక్ష్మి ముత్యాలమ్మ ఇసుక క్వారీ సొసైటీ 1964 యాక్ట్ గవర్నమెంట్ జీవో ప్రకారం ఉన్న సొసైటీకి ఎకో- సెన్సిటివ్ జోన్ సాకు చూపిస్తూ అనుమతి ఇవ్వని అధికారులు ఏజెన్సీలో గిరిజనేతరులకు పట్టా ల్యాండ్ లో ఇసుక తవ్వకాలకు ( క్వారీ నిర్వాహణకు ) ఎలా పర్మిషన్ ఇస్తారని ప్రశ్నించారు. మండల, జిల్లా అధికారులు దీనిని పరిగణలోకి ఇక నైనా ఆలోచించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

లేని యెడల మండల, జిల్లా స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో శ్రీ మహాలక్ష్మి ముత్యాలమ్మ ఇసుక క్వారీ సొసైటీ ఉపాధ్యక్షుడు ఎట్టి రవి, సొసైటీ డైరెక్టర్లు పోలిశెట్టి లక్ష్మయ్య, కుర్సం మల్లేష్, మడకం ముత్తయ్య, గ్రామస్తులు ఎట్టి నరసయ్య, దబ్బగట్ల రాందాస్, ఇసాల సమ్మయ్య, కొట్టం కేశవరావు, గొంది సమ్మయ్య, సోయం గణేష్, కుర్సం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.