పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం
అర్మూర్, జులై 17 (విజయ క్రాంతి) : అర్మూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టు చేనేత సహకార సంఘం డైరెక్టర్ గా ఎన్నికైన రొటేరియన్ ఖాందేశ్ సత్యమును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3150 రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ ఎన్. వి.హన్మంత్ రెడ్డి హాజరయ్యారు. పట్టు శాలువా, పూల దండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రోటరీ క్లబ్ లో సేవలు అందించినట్లుగానే పట్టు చేనేత సహకార సంఘంలో సేవలు అందించాలని ఆశించారు.
సంఘ సభ్యులకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఖాందేశ్ సత్యం హామీ ఇచ్చా రు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు దేవి రాము, కార్యదర్శి పివిఆర్ శ్రీకాం త్, కోశాధికారి రాస ఆనంద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, రోటరియన్స్ సునీల్ కుమార్, చరణ్ రెడ్డి, వంగ వివేకానంద, రాధాకిషన్, సురేష్ , చోటి లింబాద్రి, చెలిమేల రాజేందర్, కత్రాజీ రాజేందర్, మారుతీ తదితరులు పాల్గొన్నారు.






