18 July, 2026 | 2:01 AM

హోటళ్లు తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారి

18-07-2026 02:00 AM

కామారెడ్డి, జూలై 17 (విజయక్రాంతి): ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జి. విక్రమ్  గర్గుల్ జెడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలను శుక్రవారం సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు భోజనం తయారు చేసేటప్పుడు మంచి పరిశుభ్రతా పద్ధతులను పాటించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ విక్రమ్ కామారెడ్డి జిల్లా భిక్నూర్ లోని  ధాబా హోటళ్లు , రెస్టారెంట్లను  సందర్శించారు. ఫ్రిజ్లో నిల్వ ఉంచిన పాడైన ఆహారాన్ని ధ్వంసం చేశారు. రెస్టారెంట్ యజమానులకు పరిశుభ్రతను పాటించాలని, సరైన పెస్ట్ మేనేజ్మెంట్ పద్ధతులను అనుసరించాలని సూచించారు. ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఆదేశించారు.