24 June, 2026 | 1:26 AM

మహిళా పోలీస్ ఆత్మహత్య

15-06-2024 12:10 AM
  1. 14వ అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణం 

చర్మవ్యాధి తీవ్రం కావడంతో మనోవేదన

మణికొండ, జూన్14: చర్మ వ్యాధి ఎంతకూ తగ్గకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన మహిళా పోలీస్ తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ 14వ అంతస్తు పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ హరిక్రిష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మై హోం అవతార్ గేటెడ్ కమ్యూనిటీలో అనురాధ(38), జనార్ధన్ దంపతులు నివాసముంటున్నారు. వారికి కొడు కు, కూతురు ఉన్నారు.

జనార్ధన్ ప్రభు త్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా.. అనురాధ బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె కొంతకాలంగా చర్మపూత వ్యాధి తో బాధపడుతున్నారు. ఇటీవల వ్యా ధి తీవ్రత పెరగడంతో అనురాధ మ నోవేదనకు గురయ్యారు. ఈ క్రమం లో శుక్రవారం వారు నివాసం ఉంటు న్న అపార్ట్‌మెంట్ 14వ అంతస్తు నుం చి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా గతంలోనూ అనురాధ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.