24-12-2025 03:35:41 PM
సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
తుంగతుర్తి,(విజయక్రాంతి): మిషన్ భగీరథ మోటార్లు పైపుల రిపేర్ల కారణంగా అన్నారం గ్రామానికి మంచినీటి వసతి లేకపోవడంతో క్రిస్టమస్ పండుగను దృష్టిలో ఉంచుకొని వెంటనే స్పందించిన నూతన సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, అతని పాలకవర్గం ట్యాంకర్లతో తిరుగుతూ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో హరిజన( ఎస్సీ) మహారాజుల కాలనీలో రెండు వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి ఇంటింటికి ట్యాంకుల ద్వారా వాటర్ ను సరఫరా చేయడంతో ఎస్సీ కాలనీ వాసులు ఇంతకాలం ఇలాంటి సర్పంచిని, మీలాంటి సేవకుడిని మేం చూడలేదని ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మండలంలో పలు గ్రామాలు ప్రస్తుతం మంచినీటి కొరత తీవ్రంగా ఏర్పడింది. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించే ప్రత్యేక నిధులు కేటాయించి నీటి సరఫరా పునరావృతం అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.