10-11-2025 12:00:00 AM
-కూల్చివేతల కథ ఇంతేనా?
-అక్కడ రక్షణ గోడలు ఏర్పాటు చేయకపోవడంపై అనుమానాలు
-ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తేనే ప్రభుత్వ అధికారులు చర్యలు
నిర్మల్, నవంబర్ 9 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూములకు రక్ష ణ కల్పించవలసిన అధికారులు చేతులెత్తేయడంపై విమర్శలు వస్తున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రం ఏర్పాటు అయిన తర్వాత నిర్మల్ చుట్టూ భూముల ధరలకు రెక్కలు రావడంతో డిమాండ్ ఏర్పడగా కొందరు బడా నేతలు పలుకుబడి ఉన్న నాయకులు ప్రభు త్వ అసైన్మెంట్ భూములను ఆక్రమించుకొని ప్రైవేటు వెంచర్లను ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న అధికారులు ఖండితులకు చర్యలు తీసుకుంటున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని అప్పటి నిజాం సర్కార్ కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల్లో ఇప్పటికీ అనేక అక్రమ నిర్మాణాలు జరిగినట్టు ఆధారాలున్నాయి. పట్టణంలోని గాజులపేట్ మంజులాపూర్ చెరువు ఇబ్రహీంపేట్ సోఫీ నగర్ గుల్లపేట్ తదితర చెరువుల్లో ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్న భూములను కొందరు ఆక్రమించుకొని అక్రమ పట్టాలు సంపాదించారు.
నిర్మల్ పట్టణంలోని అయ్యప్ప హరిహర క్షేత్రం మల్లన్న గుట్ట వద్ద 534 సర్వేలోని రెండు ఎకరాల భూమిని ఇటీవలే కొందరు ఆక్రమించుకొని ప్రహరీ గోడ కట్టడంతో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. గుల్లపేట్ చెరువు నుండి ఇబ్రహీం చెరువుకు నీటిని మళ్లించి అలుగుకుంటను ఆక్రమించుకొని ప్లాట్లుగా మార్చుకొని కొందరు స్వాధీనం చేసుకున్నారని ఫిర్యాదులు వచ్చాయి. నిర్మ ల్ పట్టణంలోని కందకాలు ప్రభుత్వ భూములు రోడ్డుకు ఇరువైపులా ఉన్న మున్సిపల్ స్థలాలను కొందరు ఆక్రమించుకొని అందమైన భవంతు లు షెడ్లు నిర్మించుకుంటున్న రెవిన్యూ మున్సిపల్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడవలసిన అధికారులు ప్రజలు ఫిర్యాదు చేస్తే తప్ప వాటికి జోలికి వెళ్లడం లేదు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వ హించే ప్రజా ఫిర్యాదుల వివాహంలో కొం దరు సామాజికవేత్తలు కార్యకర్తలు ప్రభుత్వ భూముల ఆక్రమణ పై ఆధారాలతో సహా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఆ భూముల విషయంలో కంటి తుడుపు చర్యలే ఉండడం వల్ల ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేక పోతుంది. ప్రభుత్వం అసైన్మెంట్ చేసిన భూముల్లో అవి సాగుకు మాత్రమే ఉపయోగించాలని నిబంధన ఉన్న పేద రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్లాట్లుగా చేసి వ్యా పార సముదాయనాలు నిర్మిస్తున్నారు. నిర్మ ల్ పట్టణంలోని గొలుసుకట్టు చెరువుల ఆక్రమణలపై ఇప్పటికే వందలాదిగా ఫిర్యాదులు రాగా నీటిపారుదల శాఖ మున్సిపల్ రెవి న్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి సరిహద్దులు గుర్తించిన అక్కడ రక్షణ బోర్లు ఏర్పాటు చేయలేదు. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు సైతం ఆక్రమణకు గురవుతున్నాయి
రక్షణ చర్యలు నామ మాత్రమే
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న గొలుసుకట్టు చెరువులతో పాటు ప్రభుత్వ అసైన్మెం ట్ భూముల్లో అక్రమాలపై అధికారులు ఎమ్మెల్యే ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ చెరువుతో ఇటీవలే చర్యలు చేపట్టారు. అయ్యప్ప ఆలయ సమీ పంలో సర్వేనెంబర్ 234 ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని విచారణ జరిపిన అధికారులు అక్కడికి వెళ్లి ప్రభుత్వ భూమి చుట్టూ నిర్మించిన గోడను భవంతులను ధ్వంసం చేశారు. అక్కడ ఒక్కొ క్క ప్లాట్ ద్వారా 50 లక్షల పలకడంతో అటువంటి భూమికి కూల్చిన అధికారులు అక్కడ ప్రభుత్వ భూమి అనే బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై జిల్లా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు అక్కడ ఉన్న గుట్ట భూములలో ఆక్రమించుకునేందుకు కొందరు కుట్ర పన్ను తున్నారని ఇటీవలే ముదిరాజ్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిర్మల్ పట్టణంలోని చేనిగేట్ ఇంద్రనగర్ భాగ్యనగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రభు త్వ కందకాలను పూడ్చి అక్కడ కొందరు భూమిని ఆక్రమించుకొని అక్రమ పట్టాలు పొందినట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. పట్టణంలోని జోలినాలకు కూడా ఆక్రమణకు గురవుతుంది. కొందరు చెరువు అలుగులను ధ్వంసం చేసి కాలువలను పూడ్చివేసి ప్రభు త్వ భూమిని ఆక్రమించుకుంటున్నారు.
వీటి పై స్థానికులు ఫిర్యాదు చేసే తప్ప రెవిన్యూ అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు అక్కడికి వెళ్లిన సందర్భాలు లేవు. ఫిర్యాదులకు స్పందించిన అధికారులు అక్కడ అక్రమాలు కట్టడాలను కూల్చివేసి ప్రభుత్వ స్థలం అని గుర్తించినప్పటికీ అక్కడ అక్కడ ఇది ప్రభుత్వ స్థలం అని ఎవరు ఆక్రమించిన చర్యలు తీసుకుంటామని కనీసం నోటీసు బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో కొన్ని రోజుల తర్వాత ఆ భూములను మళ్లీ ఆక్రమించుకుందుకు ప్రయత్నాలు జరుగుతు న్నాయి. ఇదంతా నిర్మల్ పట్టణంలో ప్రతినిత్యం జరుగుతున్న రెవెన్యూ మున్సిపల్ నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వ భూముల ఆక్రమణ పై కఠినంగా వివరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
కొం దరు రాజకీయ పలుకుబడితో జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ వివాదాన్ని సద్దుమ ణిగించేలా లోపాయికారి ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారని ఆరోపణలవస్తున్నాయి. అయితే నిర్మల్ పట్టణంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మల్ ఎమ్మె ల్యే మహేశ్వర్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులపై ఒత్తిడి తేవడం గమనహరం. ఇప్ప టికైనా అధికారులు ప్రభుత్వ భూములను ఆక్రమించు కున్న వారిపై చర్యలు తీసుకోవడం లేకుండా స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ ఇనుపంచను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేస్తే ఈ భూములు కబ్జా కోరల్లోకి మారబోవని ఈ దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అధికా రులు ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టి పెట్టి కోట్లాది విలువచేసే ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతున్నారు.