calender_icon.png 10 November, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరాంపూర్ ఐకే ఓసీ తనిఖీ

10-11-2025 12:00:00 AM

-నీటి బిందువు జల సింధువు చెరువుల సందర్శన 

-ఎస్టీపీపీలో కొత్త యూనిట్ కోసం సీఎండీ సమీక్ష

మంచిర్యాల, నవంబర్ 9 (విజయక్రాంతి) : సింగరేణి సిఎండి బలరామ్ నాయక్ ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాతో పాటు జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. శ్రీరాంపూర్ ఏరియా లోని జైపూర్ మండలంలోని ఐకె ఓపెన్ కాస్ట్ గనిని సీఎండీ సందర్శించారు. ఉత్పత్తి ప్రక్రియ, రవాణా తదితర అంశాలను సమీక్షించి లక్ష్యాలను సాధించాలని నిర్దేశించారు.

గనికి పక్కన నిర్మించిన మినీ పార్కును సందర్శించారు. నీటి బిందువు జలసింధువు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బలరామ జలధి మినీ చెరువును సందర్శించారు. భూగర్భ జలాల పెంపుదల కోసం ఉద్దేశించి ఏర్పాటు చేసిన చెరువుల్లో నీరు చేరడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎండీ వెంట ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్, ఇందారం ఓసీ గని అధికారులు, తదితరులు ఉన్నారు. 

ఎస్టీపీపీని సందర్శించిన సీఎండీ..

జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని (ఎస్టీపీపీని) సీఎండీ బలరాం నాయక్ ఆది వారం సందర్శించారు. ఎస్టీపీపీలో నిర్మించనున్న 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన  భూమి పూజ సన్నాహక పనులను సమీక్షించారు. త్వరలోనే శంకుస్థాపన ఉంటుందని, కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఎస్ టి పి పి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్, ఇతర అధికారులను ఆదేశించారు.

అనంతరం ఎస్టీపీపీలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన మిథునాల్ ప్లాంట్ ట్రయల్ రన్ పనితీరును పరిశీలించారు, త్వరలో ప్రయోగత్మకంగా ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. ఎస్ టి పి పి ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటి బిందువు జలసింధువు చెరువులను పరిశీలించారు.  సీఎండీ వెంట డైరెక్టర్ (ఈ అండ్ ఎం) ఎం తిరుమలరావు ఎస్ టి పి పీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ చిరంజీవి, జనరల్ మేనేజర్లు  నరసింహారావు, మదన్మోహన్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు.

రామగుండం ఏరియాలో...

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం- 1 ఏరియాలో జీడికే 5 ఓపెన్ కాస్ట్ గనిని సీఎండీ బలరాం నాయక్ సందర్శించి ఉత్పత్తిని సమీక్షించారు. ఓబీ డంపులపై   నాటిన మొక్కలను పరిశీలించి మొక్క లు నాటారు. అనంతరం ఓపెన్ కాస్ట్ గని కోసం నిర్మించిన బేస్ వర్క్ షాప్ ను అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. సీఎండీ వెం ట డైరెక్టర్ (ఈ అండ్ ఎం) ఎం తిరుమలరావు, ఏరి యా జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, ఇతర అధికారులున్నారు.