21-02-2026 12:53:43 AM
సూర్యాపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా
సూర్యాపేట, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): తెలంగాణలో కుల మతాలకతీ తంగా పండుగలు నిర్వహించడం ఆనవాయితీ అని మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా తెలిపారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని పూజ లు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సంతోషిమాత దేవాలయం కమిటీ సభ్యులు ప్రతి ఏటా ఆధ్యా త్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయం అన్నారు.ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో అన్ని వర్గాల ప్రజలు కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు సోదర భావంతో నిర్వహించుకోవడం గర్వకారణం అన్నారు. నూతనంగా ఇటీవల మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా శ్రీ సంతోషిమాత దేవాలయం కమిటీ ఆహ్వానం మేరకు దేవాల యంకు విచ్చేసి పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ గౌరవ అధ్యక్షులు నూక వెంకటేశం గుప్త అధ్యక్షులు బ్రాహ్మణపల్లి మురళీధర్ ప్రధాన కార్యదర్శి పబ్బా ప్రకాశరావు కోశాధికారి కొత్త మల్లికార్జున్ సహాయ కార్యదర్శి దేవరశెట్టి సోమయ్య కమిటీ సభ్యులు బెలిదే శ్రీనివాసు గోపారపు రాజు ,లక్ష్మారెడ్డి, గుండా వెంకన్న అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం పాల్గొన్నారు.