calender_icon.png 21 February, 2026 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

21-02-2026 12:55:40 AM

యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీలో కలెక్టర్ హనుమంతరావు

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 20: ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్యులకు సూచించారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని యాదగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు.

ఆస్పత్రిలో రిజిస్టర్లను పరిశీలించి వైద్యులు, మెడికల్ సిబ్బంది సమయానికి వస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఓపీకి ఎంత మంది వచ్చారు.ఏ సమస్యలతో వచ్చారని తెలుసుకొని ఏ రోగులు ఎక్కువ ఇబ్బందులతో వస్తున్నారని తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందులు సరిపోను అందుబాటులో ఉన్నాయా లేదా అని అడిగారు. గత నెలలో ఆస్పత్రిలో ఎన్ని డెలివరీలయ్యాయని, అందులో నార్మల్ డెలివరీలెన్నని అడిగి తెలుసుకున్నారు.

ఇటీవల నార్మల్ డెలివరీ జరిగిన గర్భిణి స్త్రీకి ఫోన్ చేసి పుట్టిన బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది, ఎంత బరువుతో పుట్టిందని వైద్యులు సిబ్బంది ఎలా రిసీవ్ చేసుకున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మంచి వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రైవేట్ ఆస్పత్రికి కాకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఆయన వెంట వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.