5 March, 2026 | 4:00 AM

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక పండుగలు

05-03-2026 12:51 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, మార్చి 4 (విజయక్రాంతి): సంస్కృతి సంప్రదాయాలకు పండుగలు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం దర్శకుర్తిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేలు ఆశీర్వదించి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, స్థానిక సర్పంచ్ చిందం ఆంజనేయులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, రామిడి రాజిరెడ్డి, చిప్ప చక్రపాణి, సాగి అజయ్ రావు, రాజ గోపాల్ రెడ్డి, గుండా రాజేశం, శ్రీనివాస్, మ్యాక వినోద్, తదితరులు పాల్గొన్నారు.