calender_icon.png 25 October, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏజెన్సీలో సిగ్నల్స్ రాక వాటర్ ట్యాంక్ ఎక్కిన ఫీల్డ్ అసిస్టెంట్లు

22-10-2025 12:40:28 AM

  1. గ్రామాల్లో సిగ్నల్స్ లేక- ఈ కేవైసీ చేయించుకోవాడాని పడిగాపులు 
  2. ఇబ్బందులు పడుతున్న ఉపాధి హామీ కార్మికులు 

ఏటూరునాగారం,అక్టోబరు21(విజయక్రాంతి): ములుగు జిల్లాలో ఏటూరునాగారం,కన్నాయిగూడెం,వాజేడు వెంకటపురం, మంగపేట తాడ్వాయి మండలాలు పూర్తి ఏజెన్సీ ప్రాంతాలు అయినందున ఉపాధి హామీ ఈకేవైసీ ఎలక్ట్రానిక్,నో,యువర్ కస్టమర్ అనే యాప్ ద్వారా ఉపాధి కూలీలను ఫీల్ అసిస్టెంట్ల మొబైల్ ద్వారా ఫోటో క్యాపచర్ చేయాలి. దీని వల్ల ఉపాధి కూలీలకు అన్నివిధాలుగా ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సిష్టాన్ని తీసుకు రావడం జరిగింది.

కాని కొన్ని గ్రామాలలో పూర్తిగా సిగ్నల్స్ లేక ఇంటర్నెట్ లేక ఉపాధిహమి కూలీలను ఈకేవైసీ ఆప్ ద్వారా ఫోటో క్యాపచర్ చేయుటకు ఫిల్ అసిస్టెంట్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏటూరునాగారం మండలంలో కొండాయి గ్రామపంచాయతీ చల్పాక షాపల్లి కొన్ని గ్రామాలలో సిగ్నల్స్,ఇంటర్నెట్ సదుపాయాలు లేక నఈకేవైసీ కార్యక్రమంలో భాగంగా ఫొటో క్యాపచర్ చేయుటకు ఇబ్బందిగా ఏర్పడుతుంది.

గ్రామం లో ఉన్న ఉపాధి కూలీలను రిక్వెస్ట్ చేసి, సిగ్నల్స్ ఉన్న ప్రాంతానికి రావాలని మీము కోరగా,జంపన్న వాగు రూటు బాగులేదు రాలేము అని చెప్పడం జరుగుతుంది, గ్రామం లో ఉన్న వాటర్ ట్యాంకులు, స్కూల్ బిల్డింగ్స్ పైకి ఎక్కినా సిగ్నల్స్ రావడం లేదు. కావున సిగ్నల్స్ లేని గ్రామ పంచాయతీ లకు ఇంటర్నెట్ సదుపాయాలు కలిపిస్తారని గ్రామ ప్రజలు కోరుతున్నారు