22-10-2025 12:39:08 AM
- రాజరాజేశ్వరుడికి విశేషమైన పూజలు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు,
- స్వామివారి ఆజ్ఞ మేరకు ఆలయ అభివృద్ధి, విస్తరణ,
- శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 21 (విజయక్రాంతి): దక్షిణ కాశీగా పేరుగాంచిన వేముల వాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి.శృంగేరి పీఠం ఆశీస్సులు, మార్గదర్శనం మేరకు రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు కొనసాగుతున్నాయని శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి అనుగ్రహ భాషణం చేశారు. రాజన్న ఆలయ ఓ పెన్ స్లాబ్ లో శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి మహాస్వామి ఆదివారం అనుగ్రహ భాషణం చేశారు. రాజ రాజేశ్వరుడికి విశేషమైన పూజలు, భక్తులకు మెరుగైన సౌకర్యా లు కల్పించాలనే సంకల్పం, శృంగేరి పీఠం ఆశీస్సులు, మార్గదర్శనం మేరకు వేములవాడలో అభివృద్ధి, విస్తరణ పనులు ముందుసాగుతున్నాయని ప్రవచించారు.
పక్కా ప్రణాళికా ప్రకారం రాజన్న ఆలయ అభివృద్ధి పనులు,
ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం ఆలయ అభివృద్ధి, విస్తరణలో ఎ లాంటి రాజకీయాలు లేవు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భా రతి మహాస్వామి వారి మార్గదర్శనం మేరకు వేము లవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతామని రవా ణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్ తెలిపారు.ధర్మ విజయ యాత్రలో భా గంగా శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి మహాస్వామి వారికి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అ ర్చకులు ఆదివారం పూర్ణ కుంభంతో స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా రాజన్నకు విధుశేఖర భారతి మహాస్వామి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం కోటిలింగాల దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలోని ఓపెన్ స్లాబ్‌లో స్వామివారు అనుగ్ర హ భాషణం చేసే ముందు మంత్రి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి లక్ష్యం రాజన్న ఆలయ అభివృద్ధి అని స్పష్టం చేశారు. శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి మహాస్వా మి వారు ఆలయ అభివృద్ధిపై మార్గదర్శనం చేయాలని, స్వామి వారి సూచనల మేరకు ముందు కు వెళ్తామని ప్రకటించారు. ఆలయ అభివృద్ధిలో ఎలాంటి రాజకీయా లు లేవని స్పష్టం చేశారు. స్వామివారి రాక, ఆశీర్వచనాలతోరాజన్న ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రావాలని, రాష్ట్ర ప్రజలు, రైతులు సుఖ సంతోషా లతో ఉండాలని ఆకాంక్షించారు.
ఆలయ అభివృద్ధికి నిధులు ఈ సందర్భంగా ప్రభు త్వ విప్ మాట్లాడారు. రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు భక్తుల విశ్వాసాలు, అభిప్రాయాలు, పండితులు ఇతర ప్ర ముఖుల సలహాలు సూచనలు మేరకు చేపడుతున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల సహకారంతో పనులు ముందుకు సాగుతున్నాయని వివరించారు. మొదటి దశలో రూ. 76 కోట్లతో ప్రధాన ఆలయ విస్తరణ, అభివృద్ధి, రూ.35 కోట్లతో అన్నప్రసాద వితరణశాల, రూ. 47 కో ట్లతో ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. భక్తుల విశ్వాసాలు, నమ్మకాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి విస్తరణ చేస్తామని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ ఎం హ రిత, ఎస్పీ మహేష్ బి గితే పూర్ణకుంభం తో స్వాగతం పలికిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు. స్వామిని చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,ఆలయ ఈవో రమాదేవి, వేముల వాడ ఆర్డీవో రాధాభాయ్, తహసీల్దార్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.