calender_icon.png 25 October, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ప్రచారానికి బీఆర్‌ఎస్ నేతలు

22-10-2025 12:41:07 AM

- స్టార్ క్యాంపెయినర్లుగా ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురు

- కలహాలతో సరిపెట్టకుంటున్న కాంగ్రెస్ నేతలు

- ఒక్కో స్టార్ క్యాంపెయినర్‌కు 8 బూత్‌ల చొప్పున ప్రచార బాధ్యతలను అప్పగింత

కరీంనగర్, అక్టోబరు 21 (విజయ క్రాంతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవ ర్గం ఉప ఎన్నికల ప్రచారం కోసం బీఆర్‌ఎస్ తరపున 40 మంది స్టార్ క్యాంపెయినర్లను ఆ పార్టీ నియమించింది. 40 మందిలో ఉ మ్మడి జిల్లాకు చెందిన ఆరుగురు ముఖ్య నేతలు ఉన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తా రక రామారావు, కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు.

ఎన్నికల ప్రచారం ముగిసే వరకు వీరు జూ బ్లీహిల్స్‌లో ఉండి ప్రచారం నిర్వహించనున్నారు. ఒక్కో స్టార్ క్యాంపెయినర్‌కు 8 బూ త్ ల చొప్పున ప్రచార బాధ్యతలను అప్పగించారు. వీరికి తోడుగా కరీంనగర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, సిరిసిల్ల అ ధ్యక్షుడు తోట ఆగయ్య, జగిత్యాల పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, పెద్దపల్లి అధ్యక్షుడు కోరుకంటి చందర్‌లతోపాటు పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ప్ర చారంలో పాల్గొననున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయం కోసం వీరు పనిచేయనున్నారు. ఈ స్టార్ క్యాంపెయినర్ల ప్రచారానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఆమోదం తెలిపింది.

కలహాలతోనే కాంగ్రెస్ సరి..!

జూబ్లీహిల్స్ ఎన్నికలను అధికార కాంగ్రె స్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటి కే జూబ్లీహిల్స్ లో అడ్డా వేయగా కాంగ్రెస్ నుండి మంత్రులు మినహా మిగతా నేతలకు ఇప్పటి వరకు బాధ్యతలు అప్పగించలేదు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల కోసం పోటీ ప్ర దర్శనలు, బల ప్రదర్శనలతో ఇక్కడికే పరిమితమైన నేతలు జూబ్లీహిల్స్ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇక్కడి నేతలను పార్టీ ప్రచారానికి ఉపయోగించకపోతుండడంతో వారు ఇక్కడికే పరిమితమయ్యారు. బీజేపీ నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సం జయ్ కుమార్ ఒకటి రెండు రోజుల్లో జూబ్లీహిల్స్  ప్రచారంలో పాల్గొననున్నారు.