calender_icon.png 29 August, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పెళ్లి విందులో మటన్ కోసం గొడవ.. 19 మందిపై కేసు

29-08-2024 12:29:06 PM

నిజామాబాద్, (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ఓ పెళ్లి విందులో మటన్ కోసం జరిగిన గొడవలో 19 మందిపై పోలీస్ స్టేషన్ నమోదుకు దారి తీసింది. నవీపేట ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ప్రకారం, జిల్లాలోని నందిపేట మండలం బాద్గుణకు చెందిన యువకుడికి, నవీపేట్ మండల కేంద్రానికి చెందిన యువతకి, నవీపేట్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో వివాహం అయింది.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పెళ్లి విందులో ఇరు వర్గాల వారు భోజనాల సందర్భంగా మటన్ తక్కువగా వడ్డిస్తున్నారని వరుడు తరుపు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ గొడవ చిలికి చిలిపి గాలి వానగా మారినట్టు, ఇది వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళింది. సందర్భంగా ఒకరిపై ఒకరు కర్రలతో రాళ్లకు దాడి చేసుకున్నారు. సంఘటనలో రెండు వర్గాలకు చెందిన దాదాపు 15 మంది గాయపడ్డారు.పెళ్లికి వచ్చినవారు డయల్ 100 కు ఫోన్ చేయడంతో, పోలీసులు వచ్చి మీరు వర్గాల వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయితే ఇరువురు తగ్గకపోవడంతో పోలీసులు ఇరు వర్గాలకు చెందిన19 మంది పై కేసు నమోదు చేశారు.