calender_icon.png 29 August, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్వాపూర్ లో దొంగల బీభత్సం

29-08-2024 11:10:06 AM

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు

అడ్డుపడిన దంపతులపై దాడి

రూ.లక్ష నగదు, బంగారం, బైక్ చోరీ

కాటారం: భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఓ ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడి చేశారు. తమకు అడ్డు తగులుతున్నారని ఇంట్లో భర్త తిరుపతిని కట్టేసి ఆయన భార్య స్వర్ణలత గొంతు కోశారు. ఇంట్లో ఉన్న రూ.లక్ష నగదు, ఐదు తులాల బంగారం, బైకును అపహరించారు. తీవ్ర గాయాల పాలైన స్వర్ణలత భూపాలపల్లిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు బస్వాపూర్ గ్రామాన్ని సందర్శించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనతో స్థానికంగా ఆందోళన చోటుచేసుకుంది.