02-08-2025 01:16:33 AM
మంథని, జూలై 31(విజయ క్రాంతి)మంథని మండలంలోని మల్లెపల్లి ఎస్ ఆర్ ఎస్ పి కెనాల్ కు గండి పడి రైతులకు సాగునీరు అందకపోవడంతో రైతులు మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మం త్రి అధికారులతో మాట్లాడి హుటాహుటిన గండిని పూడ్చినారు. దీంతో మంథని మండలంలోని బోయినిపేట వరకు రైతులకు సాగునీరు అందుతుంది. రైతులు తెలుపడంతోనే వెంటనే స్పందించిన మంత్రికి రైతుల కృతజ్ఞతలు తెలిపారు.