calender_icon.png 2 August, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల ద్వారానే చెడు వ్యసనాలకు చెక్

02-08-2025 01:18:28 AM

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల అర్బన్, ఆగస్టు 1 (విజయక్రాంతి): క్రీడల ద్వారా చెడు వ్యసనాలకు చెక్ పెట్టవచ్చని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అ న్నారు.మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పై యువతకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ ను జిల్లా ఎస్పీ అశోక్ కు మార్ ఘనంగా ప్రారంభించారు.

జ్యోతి ప్ర జ్వలన చేసి టోర్నమెంట్ సూచికగా బెలూన్ల ను గాల్లోకి వదిలి టోర్నమెంట్ ను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎస్పి అశోక్ కు మార్ మాట్లాడుతూ జిల్లా పోలీసులకు, యువతకు సత్సంబంధాలు మెరుగుపరచాలని జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మెగా వా లీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించడం జ రిగిందన్నారు.గడిచిన కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్, సర్కిల్ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి గెలుపొందిన వారి ని ఈరోజు జిల్లా స్థాయిలో నిర్వహించడం జరిగిందన్నారు.

గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేందుకు అ వగాహన పెంచే ఉద్దేశ్యంతో, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతను సరైన మార్గం లో ఉంచాలనే లక్ష్యంతో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరి గిందన్నారు.యువత తమ ఆలోచనలు సరై న దిశలో వినియోగించుకోవాలని, సామాజిక బాధ్యతతో ముందడుగు వేయాలని సూ చించారు. టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు యాంటీ డ్రగ్స్ వారియర్ గా పనిచేసి డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో కృషి చేయాలని సూచించారు.

యువకులు చెడు అలవాట్లకు, ఇతర చెడు మార్గాల వైపు మరలకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఉద్యోగాలు సంపాదించి, తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, గ్రామానికి మంచి గు ర్తింపు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా యువత చే మాధ కద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉంటామని అదేవిధంగా తమ చుట్టుపక్కల ఉండే వారికీ మాధకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి వివరిస్తామని,జి ల్లా ను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి తన వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేపించారు. 

ఈ కార్యక్రమం లో ఎస్ బి డిఎస్పీ వెంకటరమణ, సైబర్ క్రైమ్ డిఎస్పీ వెంకటర మణ, జగిత్యాల ,మెట్పల్లి డిఎస్పీ లు రఘు చందర్,రాములు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్,వేణు, సైదులు,ఇన్స్పెక్టర్ లు శ్రీనివా స్,ఆరిఫ్ అలీఖాన్, శ్రీనివాస్, అనిల్ కుమా ర్, సుధాకర్, కరుణాకర్ ,రామ్ నరసింహారెడ్డి,సురేష్,మరియు ఎస్.ఐలు పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.