calender_icon.png 21 December, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలో చేరిన సినీనటి ఆమని

21-12-2025 12:00:00 AM

కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ ఛీప్ రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మోదీ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి: ఆమని

హైదరబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 20 (విజయక్రాంతి) : ప్రముఖ సినీ నటి ఆమని కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో శనివారం ఆ పార్టీలో చేరగా.. ఆమెకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆమెతో పాటు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్, నంది అవార్డు గ్రహీత శోభలత కూడా బీజేపీలో చేరారు. అనంతరం వారికి రాంచందర్‌రావు పార్టీ సభ్య త్వాలను అందజేశారు.

ఆ తర్వాత పార్టీలో చేరిన సినీ నటి ఆమని  మాట్లాడుతూ మోదీ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. భారతీయులం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు.  మోదీ  అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దే శం ఉందన్నారు. సనాతన ధర్మం కోసం మో దీ ఎంతో పాటుపడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

పార్టీ సూచనల కోసం పనిచేస్తానని తెలిపారు.  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతంరావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్  తదితరులు పాల్గొన్నారు. 

పల్లెల్లోనూ పెరుగుతున్న బీజేపీ బలం

నగరాలకు మాత్రమే పరిమితమైందని విమర్శిస్తున్న వారి కళ్లు తెరుచుకునేలా పల్లెల్లోనూ బీజేపీ బలం పెరుగుతోందని రాం చందర్‌రావు తెలిపారు. అందుకు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర  కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ మద్దతుదారులు సుమారు వెయ్యికి మందికిపైగా స ర్పంచ్‌లు, 1200 మందికి పైగా ఉప సర్పంచ్‌లు, అదే విధంగా పదివేల మందికి పైగా వార్డు సభ్యులు విజయం సాధించారని వివరించారు.

గెలిచిన వారిలో కొంతమందిని అధికార కాంగ్రెస్ పార్టీ బెదిరించే ప్రయత్నాలు చేసినా, తాము బీజేపీలోనే కొనసా గుతామని స్పష్టంగా తేల్చి చెప్పారని.. ఇది బీజేపీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం అని ఆయన ఉద్ఘాటించారు. ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైన మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో వందలాది మంది బీజేపీ సర్పం చులు గెలుపొందడం విశేషమని తెలిపారు.