21-12-2025 12:00:00 AM
కార్యక్రమాల్లో కాంగ్రెస్ శ్రేణులు, రైతులు, కూలీలు పాల్గొనాలి
: మంత్రి సీతక్క
హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చే యాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపు నిచ్చారు. నిరసనకార్యక్రమాల్లో కార్మికులు, కర్షకులు, కూలీ లు, సర్పంచులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని శనివారం ఆమె ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
పల్లెల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి కనీసం వందరోజుల పాటు ఉపాధి కల్పించేందుకు 20 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టానికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉరి వేస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. ఉపాధి హామీ కూలీల్లో 90 శాతం మంది ఎ స్సీ, ఎస్టీ, మహిళలు ఉపాధి పొందుతున్నారని.. వారి ఉపాధిని దెబ్బతీసేందుకు కేం ద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
జాతిపిత మహాత్మాగాంధీ కలగన్న రామ రాజ్యం, గ్రామ స్వరాజ్యం స్ఫూర్తితో యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కానీ బీజేపీ ప్రభు త్వం ప్రతి ఏడాది పనిదినాలను తగ్గిస్తూ పేద ల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కూలీల ఉపాధి హక్కును కాపాడుకు నేందుకు కలసి కట్టుగా పోరాడుతామని, రాజకీయాలకు అతీతంగా అందరూ ఉపాధి హామీ పరిరక్షణ పోరాటంలో పాలుపంచుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.