calender_icon.png 21 December, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా హెరిటేజ్ ఫెస్ట్

21-12-2025 12:00:00 AM

హరేకృష్ణ మూవ్‌మెంట్

ఆధ్వర్యంలో.. సాంస్కృతిక 

విలువలు, యువ ప్రతిభతో ఉత్సవం

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): హరేకృష్ణ మూవ్‌మెంట్, హైదరా బాద్ ఆధ్వర్యంలో వార్షిక సాంస్కృతిక ఉత్స వం హెరిటేజ్ ఫెస్ట్ హరేకృష్ణ గోల్డెన్ టెం పుల్, బంజారాహిల్స్‌లో శనివారం ఘనంగా జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. భారతీయ సాంస్కృతి ద్వారా విద్యార్థుల్లో మేధస్సును వికసింపజేయడం, నైతిక విలువలను పెంపొందిం చడ మే లక్ష్యంగా హరేకృష్ణ మూవ్’మెంట్’కు చెందిన సాంస్కృతిక విభాగం సుమేధస ఈ ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమంగా నిర్వహించింది.

హెరిటేజ్ ఫెస్ట్ ఉత్సవం, హరే కృష్ణ మూవ్ మెంట్ యొక్క ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా, భారతదేశపు సాంస్కృతిక, నైతిక మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ, యువ కిశోరాల ప్రతిభ కు సృజనాత్మక వేదికను అందిస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 60కిపైగా పాఠశా లల నుంచి సుమారు 12,000 మంది విద్యార్థులు హెరిటేజ్ ఫెస్ట్’లో పాల్గొన్నారు. అనేక నెలల పాటు నిర్వహించిన పోటీల్లో క్వాలిఫైయింగ్ రౌండ్లు, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ కేటగిరీల్లో  విద్యార్థులు ఉ త్సాహంగా పోటీ పడ్డారు.

బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి హరిచందన దాసరి, కలెక్టర్, హైదరాబాద్ హాజరుకాగా సత్యగౌర చంద్రదాస ప్రభూ, అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్ మెంట్, హైదరాబాద్, ప్రాంతీయ అధ్యక్షుడు అక్షయపాత్ర ఫౌండేషన్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) అధ్యక్షత వ హించారు. మొత్తం 170 మందికిపైగా విద్యార్థులకు బ హుమతులు, ట్రోఫీలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ.. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమా లను ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు మరింత ప్రోత్సహించాల్సిన అవస రం ఉందన్నారకు. సత్యగౌర చంద్రదాస ప్రభూ మాట్లాడుతూ, హైదరాబాద్లోని ఏడు వేదికలలో ఈ పోటీలు నిర్వహించబడినట్లు తెలిపారు. హెరిటేజ్ ఫెస్ట్ ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందడమే కాకుండా, నా యకత్వ లక్షణాలు, బృందంగా పనిచేసే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు.