14 July, 2026 | 7:20 AM

సినిమాకు భాషా హద్దులు లేవు

11-12-2024 12:00 AM

మలయాళ స్టార్ హీరో, దర్శకుడు జోజు జార్జ్ రూపొందించిన తాజా చిత్రం ‘పని’. మలయాళంలో హిట్ టాక్ అందుకున్న ఈ సినిమాలో అభినయ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని ఆమ్ వర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెలుగులో విడుదల చేయనుండగా, రాజవంశీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 13న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో, దర్శకుడు జోజు జార్జ్ మాట్లాడుతూ.. ‘నా దృష్టిలో మంచి సినిమాకు భాషా హద్దులు లేవు. ఏ భాషలో ప్రేక్షకులైనా ఆదరిస్తారు’ అన్నారు. నటి అభినయ మాట్లాడుతూ (సైగలు).. “పని చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. ఇదొక ఎక్స్‌లెంట్ ఫిల్మ్.

టీమ్ అందరికీ ఎన్నో మంచి మెమొరీస్ ఇచ్చిందీ సినిమా” అన్నారు. తెలుగు ఫిలింఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. “మలయాళ సినిమా అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం. వాళ్లు కంటెంట్‌ను గౌరవిస్తారు. అందుకే మంచి విజయాలు సాధిస్తున్నారు. ‘పని’ అలాంటి స్ట్రాంగ్ కంటెంట్‌తో వస్తున్న మూవీ” అన్నారు. తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు డైరెక్టర్ వీరశంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజ వంశీ,మలయాళ ప్రొడ్యూసర్ సిజో వడక్కన్, నటుడు జెమినీ సురేశ్, చిత్రబృందం పాల్గొన్నారు.