14 July, 2026 | 6:06 AM

రామాయణలో సన్నీడియోల్

11-12-2024 12:00 AM

అల్లు అరవింద్, బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘రామాయణ’. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, రణబీర్ కపూర్‌లు సీతారాముల పాత్రలు పోషిస్తున్నారు. రావణుడిగా హీరో యశ్ నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీడియోల్ సైతం ఈ ప్రాజెక్టులో భాగమయ్యా రు. ఈ విషయాన్ని మేక ర్స్ అధికారికంగా వెల్లడించారు. తాజాగా సన్నీడి యోల్ ఈ సినిమాపై స్పందించారు. “అవతా ర్, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ తరహాలో రామాయణ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్‌” అని వెల్లడించారు. అయితే సన్నీడియోల్ ఏ పాత్రలో నటిస్తున్నారనేది మాత్రం చెప్పలేదు. 

నా వంతు షూటింగ్ పూర్తుంది..

తాజాగా ఈ చిత్రంపై రణబీర్ కపూర్ సైతం ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపారు. తొలి భాగంలో తన వంతు షూటింగ్ పూర్తుందని వెల్లడించారు. “రామాయణ’ చాలా గొప్ప ప్రాజెక్టు. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. చిన్నతనం నుంచి రామాయణం వింటూ పెరిగాను. రామా యణ మొదటి భాగంలోని నావంతు షూటింగ్ పూర్తి చేశాను. త్వరలోనే రెండో భాగం షూటింగ్ మొదలు కానుంది. ఇలాంటి క్యారెక్టర్‌లో నటించాలనే నా కల రామాయణతో తీరబోతోంది. ఇది భారతీయ సంస్కృతి, గొప్పదనాన్ని ప్రపంచా నికి చాటి చెప్పే చిత్రం’ అని రణబీర్ వెల్లడించారు.