14 July, 2026 | 8:26 AM

నన్ను తొక్కేయడానికే నా భర్య, పిల్లల అంశం : మంచు మనోజ్

10-12-2024 01:48 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): జల్ పల్లిలోని సినీనటుడు మోహన్ బాబు కుటుంబంలో వివాదం దృష్ట్యా చర్చలు కొనసాగాయి. సన్నిహితుల సమక్ష్యంలో మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు, మంచు మనోజు మధ్య చర్చలు జరిగాయి. చర్యల అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు. తాను ఆస్తి కోసమో, డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. తన భార్య, పిల్లల రక్షణకు సంబంధించిన విషయం అని, తన భార్య, పిల్లలు ఇంట్లో ఉండగా తనతో ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. ఇంట్లో వాళ్లపై కాకుండా తనతో ఏం పోరాడినా పర్వాలేదని మనోజ్ పేర్కొన్నారు.

తనను తొక్కేయడానికే ఆయన భార్య, పిల్లల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. అందుకే పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరానని, మనోజు ఇంటి వద్ద మోహరించిన బౌన్సర్లను పోలీసులకు చూపించారు. తనకు అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని పోలీసులే పారిపోయారని తెలిపారు. పోలీసులు ఇలా ఎందుకు ఏకపక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, తన మనుషులను పంపించే అధికారం పోలీసులకెక్కడిది..? అని ప్రశ్నించారు. ఆయనకు మద్దతు కోసం ప్రపంచంలోని అందరినీ కలుస్తానని మంచు మనోజ్ వ్యాఖ్యానించారు.జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద విష్ణు,  మనోజు బౌన్సర్ల మద్య ఘర్షణ చోటు చేసుకుంది. విష్ణు ఇరుపక్షాల బౌన్సర్లకు సర్ది చెప్పారు. 

మంచు కుటుంబంలో వివాదం చర్చనీయాంశంగా మరిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు తనపై, భార్య మౌనికపై దాడి చేసినట్లు మనోజ్ పహాడషరీఫ్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. మరోవైపు కోడుకు, కోడలుతో తనకు ప్రాణహానీ ఉందని పేర్కొంటూ మోహన్ బాబు రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహరంపై మంచు మనోజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,ఉపముఖ్యమంత్రులను, తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ మనోజ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.