6 August, 2026 | 1:44 AM

ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీల ఓటర్ల తుది జాబితా ప్రదర్శన

02-09-2025 10:57 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం గ్రామ పంచాయతీల ఓటర్ల తుది జాబితాను ఎంపీడీవో జలంధర్ రెడ్డి నోటీస్ బోర్డులో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల వార్డుల వారిగా ఓటర్ లిస్ట్ ల తుది జాబితాను పూర్తి చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ నిరంజన్, సీనియర్ అసిస్టెంట్ రాధా కుమార్ తదితరులు పాల్గొన్నారు.