గణేష్ విగ్రహాల నిమజ్జన నిర్వాహకులతో సమావేశం
03-09-2025 12:00 AM
ఘట్ కేసర్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా మంగళవారం ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ బాలస్వామి పోలీస్ స్టేషన్ కార్యాలయంలో నిర్వాహకు లతో సమావేశం ఏర్పాటు చేశారు. నిమజ్జనమునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే నిమజ్జనము రూట్ ని పరిశీలించి ఏమైనా అడ్డంకులు ఉన్నా తెలుపాలని నిర్వాహకులను కోరారు.
డీజేలకు, ప్యాడ్ బ్యాండ్ లకు అనుమతి లేదని కూడా తెలిపారు. ఒకవేళ ముందుగానే డిజెలకు, బ్యాండ్ లకు అడ్వాన్స్ ఇచ్చి ఉంటే వారి నుండి వాపసు తీసుకోవాలని, వాపస్ తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు కలిగితే పోలీసులను ఆశ్రయించాలని కూడా తెలిపారు. ఎదులాబాద్ చెరువు నందు క్రేన్ లు ఏర్పాటు చేశారు. కనుక అందరూ అక్కడే నిమజ్జనము చేయాలని కోరారు.






