డ్రైనేజీ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపండి
అబ్దుల్లాపూర్ మెట్, సెప్టెంబర్ 2: డ్రైనేజ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సీపీఐ అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి హరి సింగ్ నాయక్ అన్నారు. అబ్దుల్లాపూర్ గ్రామ పరిధి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎమ్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి మంగళవారం స్థానిక నాయకులతో కలసి అబ్దుల్లాపూర్ పంచాయితీ కార్యదర్శి ప్రసాద్ రావుకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ... జేఎన్‌ఎన్‌యూ ఆర్‌ఎం కాలనీ హైస్కూల్ నుంచి బస్ స్టాప్ వరకు ఉన్న రోడ్డుపై మురుగు నీరు ప్రవహిస్తుండ డంతో.. ఆ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లలేని దుస్థితి ఏర్పడిందన్నారు. రోడ్డంతా నాచుపట్టి బైక్‌లు స్కీడ్ అయి ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రైనేజీ సమస్య వలన కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతుంటే.. గ్రామపంచాయతీ ఆఫీసులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ.. ఆ సమస్యలను ఇంతరకు పరిష్కరించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరారు.






