18-06-2025 05:36:55 PM
ఏరియా వర్క్ షాప్ ఉద్యోగులు,అధికారులు, నాయకులు..
కొత్తగూడెం (విజయక్రాంతి): సింగరేణి కొత్తగూడెం(Kothagudem) ఏరియాలోని, ఏరియా వర్క్ షాప్ నందు, మంచితనానికి మారుపేరుగా నిలిచింది. వర్క్ షాప్ ఉద్యోగులు, వర్కుషాప్ హెచ్.ఓ.డి, డీజీఎం, టి. శ్రీకాంత్, కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్(Kothagudem Area Vice President MD Razak) పాల్గొని ఒక పేదింటి అమ్మాయి పెళ్లికి వర్క్ షాప్ ఉద్యోగులు ఎంతో సహృదయంతో, వారికి తోచిన ఆర్థిక సహాయం చేయడంతో రూ.17 వేలు జమ అయ్యాయి.
ఉద్యోగులందరి చేతుల మీదుగా జమ చేసిన రూ.17 వేలు పెళ్లికూతురు అన్నయ్యకు అందజేశారు. వక్తలు మాట్లాడుతూ... వర్క్ షాప్ ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇంతకుముందు కూడా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం చేసిన, వర్క్ షాప్ ఉద్యోగులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ జేస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.