17-05-2025 09:16:05 PM
జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు..
నిజాంసాగర్ (విజయక్రాంతి): పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు(MLA Thota Lakshmi Kantha Rao) పేర్కొన్నారు. ఆయన శనివారం నాడు నిజాంసాగర్ ప్రాజెక్టుఅతిది గృహంలో నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణం, మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని సూచించారు.నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పని చేయాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలకు లోబడి క్రమ శిక్షణతో పని చేయాలని,కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని,యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని, తగిన చర్యలు తీసుకుంటానని తేల్చి చెప్పారు.
వ్యక్తిగత విబేధాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతం దిశగా పని చేయాలని,కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు సూచించిన కొన్ని సమస్యలపై తక్షణమే స్పందించి సత్వర చర్యలు చేపడతానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, నాయకులు సంకు లక్ష్మయ్య, ప్రజా పండరి, జనార్దన్ రెడ్డి, జగన్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.