స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం
సూర్యాపేట, జూన్ 7 (విజయక్రాంతి): ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వల్లపుదాసు సైదులు గౌడ్ కుటుంబానికి 2007 బ్యాచ్మెంట్ స్నేహితులంతా కలిసి రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సైదులు స్నేహితులు మాట్లాడుతూ, తమ సహచరుడి కుటుంబానికి అండగా నిలవాలనే ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అవసరమైన సమయంలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని, నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోకూడదని పేర్కొన్నారు. సైదులు మరణం తమను తీవ్రంగా కలచివేసిందని, ఆయన కుటుంబానికి అంద రూ అండగా నిలవాలని స్నేహితులు విజ్ఞప్తి చేశారు. వారి ఈ సహాయ కార్యక్రమం మానవత్వానికి నిదర్శనంగా నిలిచిందని పలువురు అభినందించారు. కార్యక్రమంలో సురేందర్‌రెడ్డి, మధు మోహన్, రవి, నాగరాజు, కరుణాకర్, సైదులు, బాలకృష్ణ, మాధవ్ కొండల్ పాల్గొన్నారు.






