సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
09-05-2026 02:53 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద సొసైటీ స్టాప్ అసిస్టెంట్ నర్సింలు అకస్మాత్తుగా ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా ఫాక్స్ ఉద్యోగుల యూనియన్ సభ్యులు మృతుడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి జిల్లా యూనియన్ తరపున 21 వేలు,,నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్,మాజీ ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి,సొసైటీ సెక్రటరీ సందీప్ కుమార్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.






