మిత్రుడి కుటుంబానికి అండగా మిత్ర బృందం
06-04-2026 08:42 PM
చిట్యాల,(విజయక్రాంతి): ఇటీవల మృతి చెందిన మిత్రుడి కుటుంబానికి అండగా మిత్రబృందం నిలిచి ఆర్థిక సహాయం సోమవారం అందజేశారు. చిట్యాల పట్టణ కేంద్రo 9 వ వార్డ్ కు చెందిన మునుగోటి వెంకన్న ఇటీవల మరణించగా, ఆయనతో కలిసి చిట్యాల జడ్పీహెచ్ఎస్ లో చదువుకున్న 2006-2007 పదవ తరగతి మిత్ర బృందం 1,23,000 ( ఒక లక్ష ఇరువై మూడు వేల రూపాయలను) చిట్యాల పోస్ట్ ఆఫీస్ లో వెంకన్న కూతురు రేణుక పేరు మీద ప్రధాన మంత్రి సుకన్య యోజన పథకంలో డిపాజిట్ చేసి సంబంధిత పత్రాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. రాబోయే రోజులలో వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుండాల నరేష్ గౌడ్, దమ్మల నరేందర్ రెడ్డి, చిన్నపాక నాగరాజు, జిట్టా శేఖర్, కూరాకుల యాదగిరి పాల్గొన్నారు.




