6 April, 2026 | 10:38 PM

భాగ్యనగర్ తండా, అప్పాయిగూడెంలో హైమాస్ట్ లైట్లు మంజూరు

06-04-2026 08:39 PM

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెల్పిన సర్పంచ్ హీరాలాల్, ప్రవీణ్

కారేపల్లి,(విజయక్రాంతి): సింగరేణి మండలం భాగ్యనగర్ తండా, అప్పాయి గూడెం గ్రామ పంచాయతీలకు వైరా ఎమ్మెల్యే హైమాస్ట్ లైటు మంజూరు చేసినట్లు సర్పంచ్ బానోత్ హీరాలాల్, దండు ప్రవీణ్ లు తెలిపారు. సోమవారం లైట్ ఏర్పాటుకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలలో పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో సర్పంచ్ లు  మాట్లాడుతూ... గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మార్గదర్శకంలో  అభివృద్ధి పనులు చేపట్టటం జరుగుతుందన్నారు. అభివృద్దిని నిధుల వెసులుబాటు అనుసరించి ప్రాధాన్యత క్రమంలో చేయటం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.