10-12-2025 07:07:47 PM
కోదాడ: మండల పరిధిలోని ఎర్రవరం గ్రామానికి చెందిన నాగుల్ మీరా అనారోగ్యంతో మృతిచెందాడు. అతని కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ విద్యా సమితి అధ్యక్షుడు తారక్ గౌడ్ తన మిత్ర బృందంతో కలిసి బుధవారం 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. నిరుపేద కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పెండెం వెంకట్రాం, షేక్ లతీఫ్, బూరా శ్రీను, ఉద్దండు, శ్రీనివాసు, వరదయ్య, వెంకటేశ్వర్లు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.