calender_icon.png 11 December, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్ విశ్వవిద్యాలయం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ల మధ్య ఎంఓయూ

10-12-2025 07:10:04 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): వెంకటాపూర్ లోని అనురాగ్ విశ్వవిద్యాలయం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లు బుధవారం ఎంఓయుపై సంతకాలు చేశాయి. ఈ సంస్థల మధ్య అవగాహన పత్రం అనుసరించి అనురాగ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు బీటెక్, ఎంటెక్, పీ.హెచ్.డీ, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఎన్.ఆర్.ఎస్.సి నందు పూర్తి చేయవచ్చు. ఎన్ఆర్ఎస్సి, అనురాగ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించవచ్చు. అనురాగ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్, ట్రైనింగ్ ల కొరకు ఎన్ ఆర్ ఎస్ సి సహాయం కోరవచ్చును.

ఈ అవగాహన పత్రంపై ఎన్ ఆర్ ఎస్ సి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్, అనురాగ్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చన మంత్రి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎన్. అపర్ణ గ్రూప్ హెడ్, టీఈఓజి ఎన్ఆర్ఎస్సి, పి. శశిధర్ రెడ్డి, అనురాగ్ విశ్వవిద్యాలయ సీఈవో ఎస్ .నీలిమ, ఓఐఏ డైరెక్టర్ డాక్టర్ సిద్ధార్థ గోష్, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సంతోష్ పాల్గొన్నారు. ఈ ఎంఓయు జరుగుటకు ఎంతగానో సహకరించిన ఎన్ఆర్ఎస్సి శాస్త్రవేత్త డాక్టర్ జయసక్సేనాకు అనురాగ్ విశ్వవిద్యాలయ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.