calender_icon.png 12 December, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్ఎంఆర్ఈసిలో ముగిసిన జాతీయస్థాయి హ్యాకథాన్-2025

10-12-2025 07:06:17 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ పోచారం సర్కిల్ దివ్యనగర్ లోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2025 గ్రాండ్ ఫినాలే కార్యక్రమం బుధవారం దేశం నలుమూలల నుండి వచ్చిన విద్యార్థుల పరిశోధనలు సాంకేతిక ఆవిష్కరణలతో విజయవంతంగా ముగిసింది. భారత ప్రభుత్వం ఇంజనీరింగ్ విద్యార్థులలోని సృజనాత్మకత సాంకేతిక పరిజ్ఞానం పరిశోధనాత్మక దృక్పథాలను వెలికి తీసి వారి ప్రతిభకు పట్టం కట్టేలా ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ను రూపొందించబడింది. ఇందులో తమ ప్రతిభను నిరూపించుకున్న విద్యార్థులను గ్రాండ్ ఫినాలే కు ఎంపిక చేశారు.

జరిగిన గ్రాండ్ ఫినాలే సాఫ్ట్ వేర్ ఎడిషన్ ను వేదికగా నిలిచిన నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అత్యుత్తమ కాలేజీగా మరోసారి చాటి చెప్పింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. తమ పరిశోధనల ద్వారా పరిష్కారం కనుగొనే దిశలో పోటీలు జరిగాయి. 20 కళాశాలలకు చెందిన 120 మంది విద్యార్థులు ఒక్కో టీంకు ఆరుగురు చొప్పున 20 టీములుగా ఏర్పడినారు. 48 గంటలపాటు నిరంతరాయంగా పరిశోధనలు చేసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సముద్ర అధ్యాయనం, జీవవైవిద్యం తదితర అంశాలపై రీసెర్స్ చేశారు.

అత్యుత్తమ పరిశోధన పరిష్కారం సూచించిన నాలుగు కళాశాలల విద్యార్థుల టీం లకు బహుమతులను ప్రకటించారు ఒక్కో టీముకు రూ. లక్ష 50 వేలు నగదు బహుమతి ప్రశంసా పత్రం మెమొంటోలను బహుకరించారు. ముగింపు వేడుకలకు నల్ల మల్లారెడ్డి విద్యాసంస్థల చైర్మన్ సంధ్యావలి, సెక్రటరీ నల్ల మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా వచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఏఐసిటిఈ ఇన్ఫోసిస్ కు చెందిన ప్రముఖులు న్యాయ నిర్నేతలుగా వ్యవహరించారు. బహుమతులు సాధించిన విజేతలను కళాశాల డైరెక్టర్ లు డాక్టర్ దివ్య నల్ల, స్నేహ నల్ల, కేంద్ర ప్రభుత్వం తరఫున డాక్టర్ భీమ లింగేశ్వర్ రెడ్డి, సామ్రాట్ షిండే, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎన్.వి రమేష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. రాజశేఖర్, అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమ కన్వీనర్ గా సిఎస్ఈ హెడ్ డాక్టర్ ఎం. రాజు వ్యవహరించారు.