6 August, 2026 | 2:30 AM

డంపింగ్ యార్డ్‌కు శాశ్వత పరిష్కారం చూపండి

06-08-2026 12:00 AM

ఎంపీ ఈటల రాజేందర్                            

జవహర్ నగర్, ఆగస్టు 5 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో నెలవై ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కేంద్ర మంత్రికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బుధవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీ ఈటెల రాజేందర్ విలేకరులతో మాట్లాడుతూ రోజుకు పదివేల మెట్రిక్ టన్నుల చెత్త ఒకే చోట వేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

జవహర్ నగర్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలైన కీసర, అహ్మద్గూడా, నాగారం, ఘట్కేసర్, దమ్మాయిగూడ, మొదలైన ప్రాంత ప్రజలు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల తీవ్రమైన కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని, జీరో పొల్యూషన్ తో చెత్త రీసైకిల్ చేపట్టాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు. ఈ మేరకు కేంద్ర  మంత్రి హైదరాబాదులోనూ ఢిల్లీ తరహా వ్యర్ధాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.