6 August, 2026 | 2:14 AM

గురు ఎన్ రెడ్డికి ఆటా సత్కారం

06-08-2026 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ వేదికగా జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలో యూత్ కన్వెన్షన్ 2026లో కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ గురు ఎన్. రెడ్డికి వైద్యం, ఆరోగ్య రంగంలో విశిష్ట సేవలు, నాయకత్వానికి గుర్తింపుగా ‘మెరిటోరియస్ సర్వీస్ ఇన్ మెడిసిన్ అండ్ హెల్త్కేర్ లీడర్షిప్‘ విభాగంలో ఆటా అత్యున్నత పురస్కారం ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు డాక్టర్ గురు ఎన్. రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిర్వహించిన బిజినెస్ ఫోరంలో ‘ఇన్నోవేషన్ వితౌట్ బోర్డర్స్ అందరూ అసాధ్యమన్నారు. అయినా నిర్మించిన ఒక పారిశ్రామికవేత్త ప్రయాణం‘ అనే అంశంపై ముఖ్య వక్తగా ప్రసంగించి, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలు, నాయకత్వం, ప్రపంచ స్థాయి వైద్య సంస్థల నిర్మాణంలో తన అనుభవాలను పంచుకున్నారు.